
రోబో సీక్వల్ గా శంకర్ డైరక్షన్లో వస్తున్న సినిమా 2.0 సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా బాలీవుడ్ క్రేజీ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కొద్దిగంటల క్రితం రిలీజ్ చేశారు. ముంబైలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేస్తుంది. ప్రపంచం కేవలం మనుషులకే కాదు అన్న ట్యాగ్ తో వదిలిన ఫస్ట్ లుక్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక రోబోగా రజిని అదిరే లుక్స్ తో కనిపించగా విలన్ గా అక్షయ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.
340 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా భారతీయ సినిమాలోనే భారీ మొత్తంతో రూపొందించబడుతున్న సినిమాగా క్రేజ్ సంపాదించింది. ఎమి జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కరణ్ జోహార్ అధ్యక్షత జరిగిన ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ కు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాను 2017 దీవాళికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.