
9 ఏళ్ల తర్వాత మెగాస్టార్ సోలో మూవీగా వస్తున్న ఖైది నెబర్ 150 ఓ పక్క షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ క్రమంలో తన 151వ సినిమా గురించి కూడా డిస్కషన్స్ చేస్తున్నారట మెగాస్టార్. ఇప్పటికే డైరక్టర్ ఫిక్స్ అయ్యాడని ఫిల్మ్ నగర్ టాక్. ముందునుండి చెబుతున్నట్టుగానే బోయపాటి శ్రీను మెగాస్టార్ 151వ సినిమాను డైరెక్ట్ చేస్తాడట. కథ కూడా ఫైనల్ చేశారని టాక్.
మాస్ అండ్ కమర్షియల్ సినిమాలకు బోయపాటి పెట్టింది పేరు. అభిమానులు తమ హీరోని ఏ రేంజ్ లో చూడాలనుకుంటారో అదే రేంజ్ లో చూపిస్తాడు బోయపాటి. ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ హీరోగా సినిమా డైరెక్ట్ చేస్తున్న బోయపాటి శ్రీను ఆ సినిమా తర్వాత మెగాస్టార్ ను డైరెక్ట్ చేస్తాడట. ఖైది సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆ రాబోయే సినిమా షూటింగ్ ప్రారంభిస్తారట. అల్లు అరవింద్ ఆ సినిమా నిర్మించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.