
మెగా హీరోల్లో వరుణ్ తేజ్ సెపరేట్ స్టైల్.. ముకుంద, కంచె, లోఫర్ ఈ మూడు సినిమాలతో తనలోని టాలెంట్ బయట పెట్టిన వరుణ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే కాకుండా కథా బలమున్న సినిమాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం శ్రీనువైట్ల డైరక్షన్లో మిస్టర్, శేఖర్ కమ్ముల డైరక్షన్లో ఫిదా మూవీ చేస్తున్న వరుణ్ తేజ్ తన తండ్రి స్థాపించిన అంజనా ప్రొడక్షన్స్ బాధ్యతలను మీద వేసుకోబోతున్నాడు.
మెగాస్టార్ తో సినిమాలను తీసి మంచి బ్యానర్ గా గుర్తింపు తెచ్చుకున్న అంజన ప్రొడక్షన్స్ ఆరెంజ్ దెబ్బకు ఆగిపోవాల్సి వచ్చింది. నాగబాబు బుల్లితెర షోలకు హోస్ట్ లుగా.. సినిమాల్లో గెస్ట్ క్యారక్టర్స్ వేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈలోపే కొణిదెల ప్రొడక్షన్స్ అని చరణ్ ఓ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేశాడు. అందుకే వరుణ్ తేజ్ కూడా ఆల్రెడీ ఉన్న ప్రొడక్షన్ ను మళ్లీ రీ లాంచ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. ఓ విధంగా వరుణ్ తీసుకున్న ఈ డెశిషన్ కు గట్స్ ఉండాల్సిందే.
నిర్మాతగా తండ్రినే కంటిన్యూ చేసేలా చూస్తూ తన ప్రొడక్షన్ లో కీలకంగా మారుతున్నాడట వరుణ్ తేజ్. మరి వరుణ్ మళ్లీ స్టార్ట్ చేస్తున్న అంజనా ప్రొడక్షన్స్ ఎలాంటి సినిమాలను తీస్తుందో చూడాలి.