కెరియర్ లో ఇదే బెస్ట్

కుర్ర హీరో నిఖిల్ ఇప్పుడున్న జోష్ మనకు తెలిసిందే. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా హిట్ టాక్ రావడంతో మనోడు మంచి ఖుషిగా ఉన్నాడు. నోట్ల రద్దు ఎఫెక్ట్ సినిమా మీద పడుతుంది అనుకుంటున్న టైంలో సినిమా పాజిటివ్ రావడమే కాదు నిఖిల్ కెరియర్ లో భారీ ఓపెనింగ్స్ తెచ్చింది. అంతేనా సినిమా హిట్ అవడంతో శాటిలైట్ రైట్స్ కూడా భారీగానే అమ్ముడయ్యాయట. తెలుస్తున్న సమాచారం ప్రకారం మాటివి వారు నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాను 3 కోట్ల మొత్తంతో కొన్నారట.

నిఖిల్ కెరియర్ లో ఈ రేంజ్ శాటిలైట్స్ వెళ్లడం ఇదే మొదటిసారి. కెరియర్ మొదట్లో కమర్షియల్ హిట్స్ కోసం రకరకాల ప్రయత్నాలు చేసిన నిఖిల్ కొత్త తరహా కథలతో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్నాడు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య తర్వాత శంకరాభరణం లాంటి ఫ్లాప్ పడినా మళ్లీ ఈ కొత్త సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేశాడు. 

విఐ ఆనంద్ డైరక్షన్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. సస్పెన్స్, థ్రిల్, కామెడీ మూడు సమపాళ్లలో నడిపించిన తీరు ప్రేక్షకులు సినిమా మీద మంచి ఒపినియన్ కు వచ్చేలా చేసింది.