వాళ్ళిద్దరిని అవమాన పరచిన పూజా..!

స్టార్ హీరో పక్కన ఛాన్స్ దొరికితే ఏ హీరోయిన్ అయినా ఓకే అనాల్సిందే. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్ అంటే స్టార్ క్రేజ్ కు డోర్స్ తెరచుకున్నట్టే అయితే అలాంటి ఆఫర్ వచ్చినా సరే కాదనేసింది ఓ అమ్మడు. కేవలం తెలుగులో రెండు సినిమాలే చేసిన అవి కూడా అంతంత మాత్రంగానే ఆడాయిలేండి. అయినా సరే అమ్మడి అందానికి అవకాశం ఇచ్చినా కాదనేసింది. ఇంతకీ ఎవరా బ్యూటీ అంటే పూజా హెగ్దె అని తెలుస్తుంది. 

మాస్క్ తర్వాత డైరెక్ట్ గా తెలుగులో ముకుంద, ఒక లైలా కోసం సినిమాలు చేసిన పూజా హెగ్దె ఆ తర్వాత బాలీవుడ్ హృతిక్ సినిమా మొహెంజోదారో ఆఫర్ రాగానే అక్కడికి షిఫ్ట్ అయ్యింది. ఇక ఆ సినిమా షూట్లో ఉండగా బన్ని సరైనోడు, తారక్ జనతా గ్యారేజ్ సినిమాలకు ఆమెను సంప్రదించారట. డేట్స్ అడ్జెస్ట్ అయ్యేలా లేవని.. అది కాకా మొహెంజోదారో మూవీ టైంలో ఏ సినిమా చేయకూడదు అనే కమిట్మెంట్ తో ఆ సినిమాలను మిస్ చేసుకుందట.

అదే కనుక బన్నితో సరైనోడు, జూనియర్ తో జనతా గ్యారేజ్ సినిమా చేసుంటే కచ్చితంగా పూజా ఇప్పటికి ఓ రేంజ్లో ఉండేది. అయినా సరే ఒకసారి ఛాన్స్ మిస్ అయినా ప్రస్తుతం బన్నితో దువ్వాడ జగన్నాథలో ఆమె హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.