
వరుణ్ తేజ్ 15వ సినిమా ప్రకటన వచ్చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ హర్రర్-కామెడీ సినిమా చేయబోతున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్లపై నిర్మించబోతున్న ఈ సినిమాకి ధమన్ సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమా ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ చాలా భిన్నంగా ఉంది. ‘కదిరి నరసింహ సామి శాచచ్చిగా ఈ తూరీ నవ్వించేకి వస్తుండా,’ అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, పనిచేయబోయే సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామని దర్శకుడు మేర్లపాక గాంధీ భవన్లో చెప్పారు.
కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా!
— Varun Tej Konidela (@IAmVarunTej) January 19, 2025
Let's do this @gandhimerlapaka @musicthaman 👊#VT15 @Uv_creations @FirstFrame_ent
감사합니다. pic.twitter.com/1XS47rDsmB