
ఈరోజు ఉదయం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో భూప్రకంపనాలు వచ్చాయి. మళ్ళీ ఈరోజు మరికొన్ని ప్రకంపనలు రానున్నాయి. కానీ వాటిని చూసేందుకు అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈరోజు సాయంత్రం అన్నపూర్ణా స్టూడియోస్‌లో అక్కినేని నాగ చైతన్య, శోబితా ధూళిపాళ వివాహం జరుగనుంది. నాగ చైతన్య-సమంత విడాకులు, వాటి గురించి వచ్చిన ఊహాగానాలు, ఆ తర్వాత నాగ చైతన్య, శోబితా ధూళిపాళల వివాహ నిశ్చితార్ధం జరుగగానే ‘మూడేళ్ళలోనే వారు విడిపోతారంటూ’ వేణుస్వామి జోస్యం చెప్పడం, దానిపై జరిగిన రచ్చ అందరికీ బహుశః గుర్తుండే ఉంటుంది.
వాటన్నిటినీ అధిగమించి నాగ చైతన్య, శోబితా ధూళిపాళ వివాహం నేడు జరుగనుంది. కనుక ఇది చాలా ప్రత్యేకమైనదే అని భావించవచ్చు. ఇప్పటికే అన్నపూర్ణా స్టూడియోస్‌లో ఆ హడావుడి మొదలైపోయింది. అక్కినేని అభిమానులు వారి వివాహ వేడుకలు, విశేషాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.
ఇక ఈరోజు రాత్రి 9.30 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాలలో పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో విడుదల కాబోతోంది. పుష్ప-2 సృష్టిస్తున్న ప్రభంజనం అందరూ చూస్తూనే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. ఉత్తరాదిన బిహార్ ప్రజలతో సహా యావత్ భారతీయులు, విదేశాలలో భారతీయులు సైతం దీని కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
కనుక పుష్ప-2 విడుదలతో మళ్ళీ సినీ పరిశ్రమలో ప్రకంపనలు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే అవి పరిశ్రమకు ఎంతో మేలు చేసేవే కనుక అందరూ తప్పక స్వాగతిస్తారు.
Vishwanth theater kukatpally 💥#Pushpa2TheRule @alluarjun pic.twitter.com/pKXM1M6vev