
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం నేడు వెల్లడించింది. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి ఈ విషయం ప్రకటించారు.
ముక్కోణపు క్రైమ్ స్టోరీతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ కలిసి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు కధ: ఎస్.కృష్ణ, జీ ఆదినారాయణ, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు అందిస్తున్నారు.
10న రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో ‘గేమ్ ఛేంజర్’ దాని తర్వాత జనవరి 12న బాలకృష్ణ-బాబీ సినిమా ‘డాకూ మహరాజ్’ విడుదల కాబోతున్నాయి. మూడు పెద్ద హీరోల సినిమాలే కనుక వాటి మద్య గట్టి పోటీ ఉండవచ్చు. కానీ వాటిలో ఏదైనా కాస్త అటూ ఇటూగా ఉన్నా సంక్రాంతి పండుగ సీజన్‌లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ ఖాయమే.