మెకానిక్ రాఖీ ట్రెయిలర్ 2.0

విశ్వక్ సేన్‌, మీనాక్షీ చౌదరి జంటగా చేస్తున్న ‘మెకానిక్ రాఖీ’ శుక్రవారం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ఓ ట్రైలర్‌ విడుదల చేశారు. ఆదివారం మరో ట్రైలర్‌ 2.0 విడుదల చేశారు. 

నూతన దర్శకుడు ముళ్ళపూడి రవితేజ దర్శకత్వంలో వస్తున్న ‘మెకానిక్ రాఖీ’లో శ్రద్ధ శ్రీనాధ్, సునీల్, నరేశ్ వికె, హైపర్ ఆది, హర్ష వర్ధన్, వివ హర్ష, రఘురాం తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ చరణ్‌ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రవితేజ ముళ్ళపూడి, పాటలు: సుద్ధాల అశోక్ తేజ, కృష్ణ చైతన్య, సనరే, కెమెరా: మనోజ్ రెడ్డి కాటసాని, కొరియోగ్రఫీ: భాను, యష్, యాక్షన్: సుప్రీం సుందర్, ఎడిటింగ్: అన్వర్ అలీ చేస్తున్నారు.