నయనతార యాక్షన్ ఫిల్మ్ రక్కాయి... టైటిల్‌ టీజర్‌

లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రధానపాత్రలో చేస్తున్న సినిమా టైటిల్‌ ‘రక్కయీ’, టైటిల్‌ టీజర్‌ సోమవారం విడుదల చేశారు. సెంథిల్ నల్లస్వామి దర్శకత్వంలో డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్, మూవీవేర్స్ స్టూడియోస్ కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. 

టైటిల్‌ టీజర్‌లో ఓ బిడ్డని కాపాడుకునే యోధురాలిగా నయనతారని చూపారు. తన బిడ్డని చంపడానికి వస్తున్నవారిని ఓ చేతిలో బల్లెం, మరో చేతిలో కొడవలి పట్టుకొని ఒంటరిగా ఎదుర్కొన్న యోధురాలిగా చూపారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సెంథిల్ నల్లస్వామి, సంగీతం: గోవింద్ వసంత, కెమెరా: గౌతమ్ రాజేంద్రన్, ఆర్ట్: ఏ.రాజేష్, స్టంట్స్‌: స్టాన్నర్ శామ్, ఎడిటింగ్: ప్రవీణ్ ఆంటోనీ చేస్తున్నారు.