అమెజాన్ ప్రైమ్‌లో రానా దగ్గుపాటి షో!

ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి ఓ పక్క విభిన్నమైన కధాంశాలతో సినిమాలు చేస్తూనే మద్యలో ఓటీటీలలో సందడి చేస్తుంటారు. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో ఆయన స్వయంగా నిర్మించి హోస్ట్ చేస్తున్న ‘ది రానా దగ్గుబాటి షో’ నవంబర్‌ 23 నుంచి ప్రారంభం కాబోతోంది. 

అమెజాన్ ప్రైమ్‌ సంస్థ ఈ విషయం తెలియజేస్తూ ఓ పోస్టర్‌ విడుదల చేసింది కూడా. రానా నిర్మాతగా ఆయన సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా ఈ షోని నిర్మించింది. 

ఈ షోలో రాజమౌళి, రాంగోపాల్ వర్మ వంటి పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్న ఎపిసోడ్స్ షూటింగ్‌ ఇప్పటికే పూర్తయింది. కనుక ఈనెల 23 నుంచి ‘ది రానా దగ్గుపాటి షో’ ప్రసారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

రానా దగ్గుబాటి ఇదివరకు ‘నంబర్‌ వన్ యారీ’ పేరుతో చేసిన షో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కనుక ఇప్పుడు ఈ షోతో రానా సందడి చేయబోతున్నారు.