త్రిబాణధారి బార్బరిక్... టైటిల్ గ్లిమ్స్

ఏదైనా ఓ సినిమా సూపర్ హిట్ అయితే వెంటనే ఆ జోనర్లో వరుసగా కొన్ని సినిమాలు వచ్చేస్తాయి. వాటిలో ఒకటీ అరా హిట్ అయితే అవుతాయి లేకుంటే మరో సూపర్ హిట్... మరో జోనర్లో సినిమాలు తీసేందుకు అందరూ ఎదురుచూస్తుంటారు. 

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘హనుమాన్’, నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో కల్కి ఎడి2898 సూపర్ హిట్స్ కాగానే ఆ జోనర్లో సినిమాలు మొదలయ్యాయి. తాజాగా అటువంటి సినిమాయే ‘త్రిబాణధారి బార్బరిక్’ కూడా అనుకోవాలేమో? 

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్స్ సమర్పణలో మోహన్ శ్రీవాత్స దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో సత్యరాజ్, సత్యం రాజేష్, సాంచి రాయ్, వశిష్ట ఎన్‌ సింహా ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లో “ఓ పెయింటింగ్ గీస్తున్న వ్యక్తితో “ఎవరు తాతా ఇతను,” అనే ప్రశ్నకు “ప్రపంచం గుర్తించని గొప్ప యోధుడమ్మా...” అంటే భీష్ముడా తాతా? అంటే “కాదమ్మా మాధవ... అంటూ “వెయ్యి ఏనుగుల బలశాలి భీముడికి మనవణ్ణి, ఘటోత్కచుడికి కొడుకుని నేను అంటూ ధనుర్భాణాలు పట్టుకున్న హీరోని వెనుక నుంచి చూపిస్తారు.

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మోహన్ శ్రీవత్స, సంగీతం: ఇన్‌ఫ్యూషన్ బ్యాండ్, కెమెరా: కుషేందర్ రమేశ్ రెడ్డి, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్:  శ్రీనివాస్ పున్నా, స్టంట్స్‌: రామ్ సుంకర, కొరియోగ్రఫీ: బిశ్వర్ పెంటి చేశారు.  

ఈ సినిమాని 5 భాషలలో అడిదల విజయ్‌ పాల్ రెడ్డి నిర్మించారు. సినిమా ఎప్పుడు విడుదల చేయాయబోతున్నదీ ఇంకా ప్రకటించలేదు.