
సుధీర్ వర్మ, నిఖిల్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా గురించి ఊహించిన దానికంటే ఇంకా అద్భుతంగా ఉండబోతోందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కార్ రేసర్‌గా రాణిస్తున్న హీరో లండన్ వెళ్ళి బాగా డబ్బున్న అమ్మాయిని బుట్టలో వేసుకొని లైఫ్‌లో సెటిల్ అయిపోదామనుకుంటాడు. కానీ అక్కడ ఊహించని చిక్కుల్లో పడతాడు. వాటి నుంచి బయటపడి తన కల నెరవేర్చుకుంటాడా లేదా?అనేది ఈ సినిమా స్టోరీ.
కన్నడ నటి రుక్మిణీ వసంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. దివ్యాంషు కౌశిక్, హర్ష చెముడు తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి సంగీతం: సన్నీ ఎంఆర్, పాటలకు సంగీతం: కార్తీక్ అందిస్తున్నారు. కెమెరా: రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్: నవీన్ నూలి, యాక్షన్: వెంకట్, కెవిన్ స్మిత్, టిడిపి జేమ్స్ చేశారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిఒన ఈ సినిమా నవంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.