రజినీకాంత్ కూతురు, అల్లుడు ఐశ్వర్య, ధనుష్ సుమారు 18 ఏళ్ళు చక్కగా కాపురం చేసి ఇద్దరు పిల్లలని కన్న తర్వాత మనస్పర్ధలు వచ్చి విడాకుల కోసం కోర్టుకి వెళ్ళారు. దాదాపు ఏడాదిన్నరగా ఆ కేసు నడుస్తోంది.
ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడాకులు కోరుతున్నారు. వారిని తిరిగి కలిపేందుకు రజినీకాంత్ ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరూ విడాకులకే మొగ్గు చూపుతున్నారు. కనుక త్వరలోనే కోర్టు వారికి విడాకులు మంజూరు చేయడం ఖాయమే.
కానీ చివరి ప్రయత్నంగా రజినీకాంత్ ఇటీవల దీపావళి పండుగకు అల్లుడు ధనుష్‌ని ఇంటికి ఆహ్వానించి రాజీకి ప్రయత్నించిన్నట్లు తెలుస్తోంది. తన శేష జీవితంలో మరేదీ అవసరం లేదని మీరిద్దరూ మళ్ళీ కలిసి ఉంటే చూడాలనేదే నా కోరిక అని దానిని మన్నించమని రజినీకాంత్ అల్లుడు ధనుష్‌ని, కూతురు ఐశ్వర్యని బ్రతిమాలుకున్నట్లు తెలుస్తోంది.
నేటికీ తమిళ సినీ పరిశ్రమని కంటి సైగతో శాశిస్తున్న అంత పెద్దాయన ఇంతగా బ్రతిమాలుకోవడంతో, ఆయన బాధ చూడలేక ధనుష్ రాజీకీ సిద్దపడిన్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య కూడా భర్తతో రాజీకి సిద్దపడిన్నట్లు తెలుస్తోంది.
కానీ ఈ వార్తని వారు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ఒకవేళ వారు రాజీకి సిద్దమైతే తక్షణమే కోర్టులో విడాకుల కేసు ఉపసంహరించుకోవలసి ఉంటుంది. ఈ వ్యవహారంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.