నెట్‌ఫ్లిక్స్‌లోకి దేవర... ఎప్పుడంటే...

కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన దేవర సినిమా సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. సినిమాకు మొదట్లో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ రూ.500 కోట్లు పైగా కలక్షన్స్‌ రాబట్టగలిగింది. ఇ

ప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తోంది. ఈ నెల 8వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో దేవర ప్రసారం కాబోతోంది. దేవరపై చాలా భారీ అంచనాలు ఉండటంతో నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ నిర్మాతలకు భారీగా ముట్టజెప్పి 5 భాషల్లో సినిమా హక్కులని సొంతం చేసుకుంది. నవ్8వ తేదీ నుంచి 5 భాషల్లో ఒకేసారి దేవర ప్రసారం కాబోతోంది. 

ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సైఫ్ ఆలీఖాన్ కీలకపాత్ర పోషించగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్‌, షైన్ టామ్ చాకో తదితరులు దేవరలో ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్‌. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేశారు.     

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి రూ.300కోట్ల భారీ బడ్జెట్‌తో దేవర నిర్మించారు.