అప్పుడో ఇప్పుడో కాదు నవంబర్‌ 8న విడుదల

సుధీర్ వర్మ దర్శకత్వం నిఖిల్, కన్నడ నటి రుక్మిణీ వసంత్ జంటగా తీసిన చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా చడీ చప్పుడు లేకుండా ఈ నెల 8వ తేదీన విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హీరో నిఖిల్ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, “ఈ సినిమాలో కొన్ని ప్రయోగాలు చేశాము. కానీ సినిమాలో వినోదం తగ్గకుండా చూసుకున్నాం. ఈ సినిమా రన్ టైమ్ కేవలం 2 గంటలే. ఇటీవల కాలంలో ఇంత తక్కువ రన్ టైమ్‌తో వచ్చిన సినిమా ఇదే. అయినా ఖచ్చితంగా చక్కటి అనుభూతి ఇస్తుంది,” అని అన్నారు. 

ఈ సినిమాలో దివ్యాంషు కౌశిక్, హర్ష చెముడు తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకి సంగీతం: సన్నీ ఎంఆర్, నేపద్య గాయకుడు కార్తీక్ పాటలకు సంగీతం అందించారు. కెమెరా: రిచర్డ్ ప్రసాద్, యాక్షన్: వెంకట్, కెవిన్ స్మిత్, టిడ్ జేమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. 

శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మించారు.