టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న జ్యోతి పూర్వజ్

తెలుగు టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచురాలైన జ్యోతి పూర్వజ్ టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో హీరోగా ఆమె భర్త పూర్వాజ్ నటిస్తున్నారు. ఆయనే ఈ సినిమాకి దర్శకత్వం కూడా చేయబోతున్నారు. భార్యాభర్తలు హీరో,హీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమాకి ‘కిల్లర్ పార్ట్-1 డ్రీమ్ గర్ల్’ అనే పేరు ఖాయం చేశారు. వారి తొలి సినిమాని రెండు లేదా మూడు భాగాలుగా తీయబోతుండటం మరో విశేషం. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ సినిమా కనుక రెండు, మూడు భాగాలలో తీయాలనుకుంటున్నామని జ్యోతీ పూర్వాజ్ చెప్పారు.

వారు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌ కూడా చాలా వెరైటీగా ఉంది. దానిలో ఆమె ఓ చేతికి కూరగాయల సంచీ తగిలించుకోగా, మరో చేతిలో గొడ్డలి పట్టుకున్నట్లు చూపారు. కానీ వెనుక ఉన్న అద్దంలో ఆమె వెనుక భాగం రోబోలా ఉండటమే ప్రత్యేకత. కనుక ఈ సినిమాలో ఆమె ‘రోబో విమన్’గా నటిస్తున్నట్లయితే టాలీవుడ్‌లో ఇదో సరికొత్త ప్రయోగమే. జ్యోతీ పూర్వాజ్ తమ మొదటి సినిమాతోనే ఇన్ని ప్రయోగాలు చేస్తుండటం విశేషమే.