
పవన్ సాదినేని దర్శకత్వంలో సల్మాన్ దుల్కర్ ఆకాశంలో ఒక తార అనే సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. కానీ వరుసగా సినిమాలు చేస్తుండటంతో ఆలస్యమవుతోంది. వచ్చే నెలాఖరులోగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి సల్మాన్ దుల్కర్‌కి జోడీగా ఎంపిక చేసిన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
సుప్రసిద్ద సినీ నిర్మాణ సంస్థలు వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్, స్వప్నా సినిమాస్, లైట్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి ఈ సినిమాని చాలా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నాయి. ఈ సినిమాకి సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మాతలు.
త్వరలోనే ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబందించి పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.