మే 1న హిట్... ది థర్డ్ కేస్ విడుదల

శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్’ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్ పేరుతో విడుదలైన రెండు సినిమాలు ప్రేక్షకులను చాలా అలరించాయి. కనుక ఈ హిట్ సిరీస్‌ కొనసాగిస్తూ ఒక్కో సినిమాలో ఒక్కో హీరోతో చేస్తున్నాడు.

‘హిట్ ది ధర్డ్ కేస్’ పేరుతో సిద్దమవుతున్న సినిమాలో నాచురల్ స్టార్ నాని పోలీస్ ఆఫీసర్‌ అర్జున్ సర్కార్‌గా నటిస్తున్నారు. మొన్న దీపావళి పండుగకు విడుదల చేసిన నాని పోస్టర్‌ చాలా బాగుంది. పోలీసుగా తక్కువ క్రిమినల్‌గా ఎక్కువ... అర్జున్ సర్కార్ ఛార్జ్ తీసుకున్నాడంటూ ఈ సినిమాలో నాని పాత్ర చాలా వైల్డ్ గా ఉంటుందని దర్శకుడు శైలేష్ కొలను చెప్పేశారు. 

ఈ సినిమాలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. కధ, దర్శకత్వం: శైలేష్ కొలను, సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు.

ఈ సినిమా నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంత్ త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025, మే 1వ తేదీన విడుదలకాబోతోంది.