
కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన ‘క’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో హిట్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సస్ మీట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, “నేను ఊహించనంతగా సినిమాకి ప్రేక్షకాధరణ లభిస్తోంది. కనుక ఈ సినిమా కోసం మేము పడిన కష్టం ఫలించిందని భావిస్తున్నాను.
ఈ సినిమాని తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కూడా విడుదల చేయమని ఫోన్లు వస్తున్నాయి. త్వరలోనే డబ్ చేసి విడుదల చేస్తాము. నవంబర్ 8వ తేదీన కేరళలో విడుదల చేస్తాము. ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నాము.
కృష్ణగిరిలో మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడుతుందని ‘క’లో చూపించాము. అలా ఎందుకు జరుగుతుంది? దాని పర్యవసానాలు ఏవిదంగా ఉంటాయనేది ‘క’ సీక్వెల్‌ల్లో చూపిస్తాము, “ అని కిరణ్ అబ్బవరం చెప్పారు.
ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తాను తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి మాట్లాడుతూ అన్న మాటలను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారని, వాటి వలన ఎవరైనా బాధపడిన్నట్లయితే క్షమించాల్సిందిగా కోరుతున్నాను. నేను ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశ్యంతో ఆవిదంగా మాట్లాడలేదు,” అని కిరణ్ అబ్బవరం చెప్పారు.