
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా వస్తున్న ‘రాబిన్హుడ్’ డిసెంబర్ 20వ తేదీన విడుదల కాబోతోంది. దీపావళి పండుగకు రాబిన్హుడ్ పోస్టర్ ఒకటి విడుదల చేశారు.
ఈ సినిమా మొదలుపెట్టినపుడే మన రాబిన్హుడ్ని పరిచయం చేస్తూ, “దేశమంత కుటుంబం నాది. ఆస్తులున్నోళ్ళు అందరూ నా అన్నదమ్ములు... ఆభరణాలు వేసుకున్నవారందరూ నా అక్కచెల్లెళ్ళు. అవసరమని వారి జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నామీద కేసులు పెడుతున్నారు.
అయినా నేను హర్ట్ అవలేదు. ఎందుకంటే అయినవాళ్ళ దగ్గర తీసుకోవడం నా హక్కు. మై బేసిక్ రైట్. బికాజ్ ఇండియా ఈజ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్...” అంటూ నితిన్ వాయిస్ ఓవర్తో చెప్పిన డైలాగ్స్ సినిమాకి మంచి హైప్ క్రియేట్ చేశాయి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి రామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేస్తున్నారు.