సంక్రాంతికి వస్తున్నాం: వెంకటేష్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ చేస్తున్న సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని ఖరారు చేయడమే కాకుండా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలోనే విడుదల చేయబోతున్నట్లు శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ ప్రకటించింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా చేస్తున్నారు. వీరి ముగ్గురి ఫోటోతో దీపావళి కానుకగా ఓ పోస్టర్‌ విడుదల చేశారు.  

ఈ సినిమాకు కధ: ఎస్‌.కృష్ణ, జీ ఆదినారాయణ,  సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

రామ్ చరణ్‌-శంకర్ల గేమ్ ఛేంజర్‌ సినిమా డిసెంబర్‌ నుంచి జనవరికి మారినందున వెంకటేష్ సినిమాని ఫిబ్రవరికి వాయిదా వేద్దామని నిర్మాత దిల్‌రాజు ప్రతిపాదనని వెంకటేష్, అనిల్ రావిపూడి ఇద్దరూ వ్యతిరేకించారు. సినిమా వాయిదాకి అంగీకరించి ఉంటే సినిమా పేరు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని కాకుండా మరొకటి పెట్టాల్సివచ్చేది.