అల్లు అర్జున్-త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠ పురములో మూడు సినిమాలు సూపర్ హిట్. కనుక వారి కాంబినేషన్లో మరో సినిమా అంటే భారీ అంచనాలే ఉంటాయి. ఇటీవల వార్తలలో ఎక్కువగా వినబడుతున్న నిర్మాత నాగ వల్లభనేని వంశీ వారి కాంబినేషన్లో సినిమా గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
అల్లు అర్జున్ పుష్ప-2 పూర్తిచేసిన తర్వాత చేయబోయే తర్వాత సినిమా త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలోనే ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ సినిమాని జనవరిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఓ చక్కటి ప్రమో రిలీజ్ చేస్తాము. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అప్పటి నుంచే అల్లు అర్జున్ కూడా షూటింగ్లో పాల్గొంటారు.
రాజమౌళి అనేక గొప్ప సినిమాలు చేశారు. కానీ ఇంతవరకు ఆయన కూడా చేయని జానర్లో మా సినిమా ఉండబోతోంది. మన దేశంలో ఇంతవరకు ఎవరూ చూడని ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాము.
విజువల్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి. అల్లు అర్జున్ అభిమానులు ఆశించిన దాని కంటే ఎన్నో రెట్లు అద్భుతంగా ఈ సినిమా ఉండబోతోంది,” అని నాగ వల్లభనేని వంశీ చెప్పారు.