జానీ మాస్టర్‌కి అప్పుడే మొదటి దెబ్బ పడింది!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు ఆయన పట్ల అల్లు అర్జున్‌ కాస్త సానుకూలంగా స్పందించిన్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనపై ఈ ఆరోపణలు వచ్చి జైలుకి వెళ్ళక ముందు పుష్ప-2లో ఐటెమ్ సాంగ్‌కి ఆయనే కొరియోగ్రాఫర్‌ అనుకున్నారు. ఇప్పుడు ఆయన బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చేశారు.

పుష్ప-2 నిర్మాతలు గురువారం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తున్నప్పుడు ఓ విలేఖరి వారిని ఈ ప్రశ్న అడగగా, ఇప్పటికే ఆ పాటని వేరే వారి చేత చేయించుకుంటున్నామని చెప్పారు.

పుష్ప-2 వంటి భారీ బడ్జెట్‌ సినిమాని, దానిలో అల్లు అర్జున్‌ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని కోల్పోవడం జానీ మాస్టర్‌కి టాలీవుడ్‌లో తొలి ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు.

జానీ మాస్టర్‌పై వచ్చిన ఆరోపణలు, నమోదైన కేసు చాలా తీవ్రమైనది కనుక ఆయన చేత తమ సినిమాలకు కొరియోగ్రఫీ చేయించుకునేందుకు దర్శక, నిర్మాతలు, అగ్రనటులు ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ ఆయనకి తమ సినిమాలలో అవకాశాలు కల్పిస్తే దాని గురించి మీడియాలో మీడియా తప్పకుండా ఏదోరకమైన వార్తలు రాకమానవు. ఈ కేసు కారణంగా ఆయన ఎన్ని రోజులు బయట ఉంటారో మళ్ళీ ఎప్పుడు జైలు లేదా కోర్టులకి వెళ్ళవలసి ఉంటుందో కూడా తెలీదు.

పైగా టాలీవుడ్‌లో అనేకమంది కొరియోగ్రాఫర్స్ అందుబాటులో ఉన్నప్పుడు ఇటువంటి ఆరోపణలు, సమస్యలలో చిక్కుకున్న జానీ మాస్టర్‌ సేవలు వాడుకుంటారా? అంటే కాదనే అనిపిస్తోంది. ఇందుకు తొలి ఉదాహరణ పుష్ప-2లో ఐటెమ్ సాంగ్‌ చేజారిపోవడమే. కానీ ఇందుకు జానీ మాస్టర్‌ తనని తానే నిందించుకోవాలి తప్ప ఎవరినీ నిందించలేరు కదా?