
బాహుబలి ప్రభాస్ పుట్టినరోజు కానుకగా బుధవారం ‘రాజాసాబ్’ నుంచి మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అయితే అభిమానులు ఊహించిన దానికి భిన్నంగా ప్రభాస్ పోస్టర్ ఉండటంతో కాస్త నిరాశ చెందారు. రాజాసాబ్ తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ సినిమా చేయబోతున్నారు.
ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచే ప్రారంభం అవుతుందని సమాచారం. కనుక నిన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాకి సంబందించి అప్‌డేట్ తప్పక వస్తుందని ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తే ఏమీ రాలేదు.
కానీ ఏమీ రాలేదని నిరాశ చెందవద్దని, మరో మంచి సమయం చూసుకొని తప్పకుండా అప్‌డేట్ ఇస్తామని, ఆలోగా రాజాసాబ్ కొత్త లుక్స్ చూసి సంతోషపడండి,” అని ఈ సినిమాని నిర్మించబోతున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రభాస్ ఫోటోతో ట్వీట్ చేసింది. ఈ నెల 31వ తేదీన బహుశః దీపావళి పండుగరోజున ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేస్తారేమో? చేస్తే సంతోషమే!
ఇప్పటికే సెప్టెంబర్‌లో ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టేశారు. “ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్నవేళ, ఒక యోధుడు దేని కోసం యుద్ధం చేయాలో పునర్నిర్వచించాడు. 1940లలో జరిగిన సంఘర్షణే ఈ సినిమా. త్వరలో షూటింగ్ మొదలవబోతోంది,” అంటూ ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు.
బ్రిటిష్ పాలనలో వారి అధీనంలో ఉన్న నేటి రాష్ట్రపతి భవన్‌పై ఫిరంగులతో దాడి చేస్తున్నట్లు చూపారు. ఆ మంటలలో బ్రిటిష్ జెండా, భవనం మంటలలో తగులబడుతున్నట్లు చూపారు.
ఈ సినిమాలో ప్రభాస్ స్వాతంత్ర సమరయోధుడుగా నటించబోతున్నట్లు చెప్పకనే చెప్పేశారు. ప్రభాస్‌కు జోడీగా కొత్త హీరోయిన్‌గా ఇమాన్వీ నటించబోతోంది. అలనాటి అందాల నటి జయప్రద, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ముఖ్యపాత్రలు చేయబోతున్నారు.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నాయి.
Dear Rebel Star Fans you have all witnessed the new avatar of our Darling #Prabhas with #RajaSaab Look 💥
— Mythri Movie Makers (@MythriOfficial) October 23, 2024
Let's celebrate #RajaSaab on this special day!#PrabhasHanu update will be given on another special occasion.
Happy Birthday, Rebel Star #Prabhas Garu ✨ pic.twitter.com/mRp0OloMTU