పుష్పరాజ్ ఒకరోజు ముందే వచ్చేస్తున్నాడుగా!

అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా పుష్ప-2 కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ శుభవార్త! ఈ సినిమా డిసెంబర్‌ 6వ తేదీన విడుదల కావలసి ఉండగా, ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్‌ 5నే ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇదేదో గాలివార్త కాదు. పుష్ప-2 టీమ్‌ స్వయంగా ట్విట్టర్‌లో ఈవిషయం తెలియజేస్తూ ఈ సినిమా నుంచి అల్లు అర్జున్‌ కొత్త పోస్టర్‌ కూడా విడుదల చేసింది. 

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ అవడమే కాదు... ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆ సినిమా పాటలు పాడారు. వాటికి అల్లు అర్జున్‌, రష్మిక వేసిన స్టెప్పులు కూడా వేసి అలరించారు. పుష్ప-2లో సూసేకా... పాట చాలా వైరల్ అయ్యింది. కనుక పుష్పరాజ్, శ్రీవల్లి ఒకరోజు ముందుగానే పలకరించడానికి వస్తుంటే అందరికీ సంతోషమే కదా?  

పుష్ప-2లో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, జగపతిబాబు, శ్రీతేజ్, మీమ్ గోపిలు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. 

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.