తమిళ నటుడు శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘అమరన్’ ట్రైలర్ విడుదలైంది. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన మేజర్ ముకుంద్ వరద తమిళిసై సౌందర్ రాజన్ జీవిత కధ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. కనుక మంచి యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్లో ఉన్నాయి. సాయి పల్లవి వంటి అద్భుతమైన నటి తోడయ్యింది కనుక గాడమైన భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు కూడా మనసులను కదిలింపజేస్తాయి.
ఈ సినిమాలో భువన్ అరోరా, రాహుల్ బోస్, శ్రీకుమార్, శ్యామ్ మోహన్, గీతా కైలాసం, ఉమైర్ లతీఫ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ, డైలాగ్స్, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: రాజ్ కుమార్ పెరిస్వామి; సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: సిహెచ్. సాయి; యాక్షన్: ఆన్భైరవ్, స్టీఫన్ రిచర్డ్; కొరియోగ్రఫీ: షరీఫ్; ఎడిటింగ్: ఆర్. కలైవణ్ణన్ చేశారు.
ఈ సినిమాని రూ.150-200 కోట్ల భారీ బడ్జెట్తో రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో ప్రముఖ నటుడు కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ కలిసి పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.