అమరన్ ట్రైలర్‌... జయహో జవాన్!

తమిళ నటుడు శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘అమరన్’ ట్రైలర్‌ విడుదలైంది. కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన మేజర్ ముకుంద్ వరద తమిళిసై సౌందర్ రాజన్‌ జీవిత కధ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. కనుక మంచి యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్‌లో ఉన్నాయి. సాయి పల్లవి వంటి అద్భుతమైన నటి తోడయ్యింది కనుక గాడమైన భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు కూడా మనసులను కదిలింపజేస్తాయి. 

ఈ సినిమాలో భువన్ అరోరా, రాహుల్ బోస్, శ్రీకుమార్, శ్యామ్ మోహన్, గీతా కైలాసం, ఉమైర్ లతీఫ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకి కధ, డైలాగ్స్, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: రాజ్‌ కుమార్‌ పెరిస్వామి; సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: సిహెచ్. సాయి; యాక్షన్: ఆన్‌భైరవ్, స్టీఫన్ రిచర్డ్; కొరియోగ్రఫీ: షరీఫ్; ఎడిటింగ్: ఆర్‌. కలైవణ్ణన్ చేశారు. 

ఈ సినిమాని రూ.150-200 కోట్ల భారీ బడ్జెట్‌తో రాజ్‌ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో ప్రముఖ నటుడు కమల్ హాసన్‌, ఆర్‌.మహేంద్రన్ కలిసి పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.