
ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ‘ది రాజాసాబ్’ సినిమా మోషన్ పోస్టర్ విడుదలైంది. ఇది హర్రర్, రొమాంటిక్ కామెడీ సినిమా అని మొదటి నుంచే మారుతి చెపుతున్నారు కనుక మోషన్ పోస్టర్లో అభిమానులు జీర్ణించుకోలేని విదంగా రాజాసాబ్‌ని చూపి షాక్ ఇచ్చారు.
ఓ పాడుబడిన భవనంలో ఒంటరిగా ఓ కుర్చీలో కూర్చొని సిగార్ కాల్చుతున్నట్లు ప్రభాస్‌ని చూపారు. పుట్టినరోజునాడు ప్రభాస్‌ని రొమాంటిక్ లేదా చిలిపిగా చూపిస్తారనుకుంటే ఈ రూపంలో చూపించడంతో అభిమానులు ఏవిదంగా స్పందిస్తారో తెలీదు కానీ సగటు ప్రేక్షకుడు మాత్రం ప్రభాస్ వంటి అందగాడిని ఈవిదంగా పరిచయం చేయడం జీర్ణించుకోవడం కష్టమే.
రాజాసాబ్‌కి జోడీగా మాళవిక మోహనన్ నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకి సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దీనిని నిర్మిస్తున్నారు. రాజాసాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.