
అభిమానులు, సినీ పరిశ్రమ చేత డార్లింగ్ అనిపించుకున్న మిస్టర్ పెర్ఫెక్ట్ ప్రభాస్ బాహుబలిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నటుడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాజాసాబ్ సినిమా నుంచి ఓ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు దర్శకుడు మారుతి ట్వీట్ చేశారు.
“ప్రభాస్ అభిమానిగా ఆయన నుంచి అభిమానులు ఏమి ఆశిస్తున్నారో అటువంటివన్నీ ఉన్న ఓ చక్కటి సినిమా అందించాలని తాను కృషి చేస్తున్నాని మారుతి చెప్పారు. ముఖ్యంగా ప్రభాస్ నుంచి మళ్ళీ ఓ చక్కటి కామెడీ అందించాలని ప్రయత్నిస్తున్నాని చెప్పారు.
ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభిమానులకు ఓ గొప్ప బహుమతి అందిస్తానని దర్శకుడు మారుతి ట్వీట్ చేశారు. మరికొద్ది సేపటిలో అదేమిటో చూడవచ్చు.
రాజాసాబ్ విషయానికి వస్తే ఇది ఓ హర్రర్, రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ అని బ్యానర్లోనే చెప్పేశారు. ఈ మూడింటిని చక్కగా మిక్స్ చేసి అందరినీ రాజాసాబ్‌తో దర్శకుడు మారుతి అందరినీ అలరించగలిగితే, పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయి అచ్చమైన తెలుగు సినిమాలకి దూరమైపోతున్న మన ప్రభాస్‌ని మళ్ళీ మనకి తెచ్చి అప్పగించిన ఘనత దర్శకుడు మారుతికే దక్కుతుంది.
Entertainment was packed, excitement peaked 💥
— Shreyas Media (@shreyasgroup) October 22, 2024
The King of Swag is here to bring you an MASSIVE treat with his UNMATCHED AURA 🤩❤🔥#TheRajaSaabOnApril10th #TheRajaSaab #Prabhas #ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/s5bFINskbc