మహేష్‌ బాబు 2032 వరకు లాక్‌ అయిపోయిన్నట్లే?

ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో మొదలవబోతున్న రాజమౌళి-మహేష్‌ బాబుల సినిమా సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ స్పూర్తితో తీస్తున్నారు. దీనిని అమెజాన్ అడవుల నేపధ్యంలో పలువురు దేశ విదేశీ నటీనటులతో తీయబోతున్నారు. 

ముఖ్యంగా ఈ సినిమాలో అనేక జంతువులు, వాటి కోసం గ్రాఫిక్స్ వగైరా ఉంటాయని రాజమౌళి స్వయంగా చెప్పారు. హాలీవుడ్‌లో పేరు మోసిన ఏ-1 స్టూడియో ఈ సినిమాకి విజువల్స్  అందించబోతోంది. 

ఈ సినిమాలో ఏఐ టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోబోతున్నట్లు రాజమౌళి చెప్పారు. ఈ సినిమా కధ, భారీతనం నేపధ్యంలో రెండు భాగాలుగా తీయక తప్పదని రాజమౌళి చెప్పిన్నట్లు తెలుస్తోంది. 

బాహుబలి రెండు భాగాలు పూర్తిచేయడానికి రాజమౌళి సుమారు ఆరేళ్ళు సమయం తీసుకున్నారు. ఆ తర్వాత కూడా సినిమా ప్రమోషన్స్ వగైరాల కోసం ముఖ్య నటీనటులు పూర్తి సమయం కేటాయించవలసి ఉంటుంది. సినిమా షూటింగ్‌ పూర్తయ్యేవరకు మహేష్‌ బాబుతో సహా ముఖ్య నటీనటులు ఎవరూ వేరే సినిమాలు చేయలేరు. 

అంతవరకు కనీసం వారి రూపురేఖలు ఏవిదంగా ఉంటాయో కూడా ఎయావారికీ తెలియనీయకుండా రాజమౌళి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కనుక ఈ సినిమాకి మహేష్‌ బాబు 6-7 ఏళ్ళు కేటాయించక తప్పదు. అంతవరకు మహేష్‌ బాబు అభిమానులకి కూడా కనిపించారన్న మాట! 

జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం అవుతుందని ఈ సినిమాకి కధ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్‌ చెప్పారు. అంటే 2025 నుంచి 2032 లేదా 2033 వరకు మహేష్‌ బాబు సినిమాలు ఉండవన్న మాట!        

ఓ అగ్రహీరో కెరీర్‌లో 6-7 ఏళ్ళపాటు వేరే సినిమా ఉండదు. ఎవరికీ కనిపించరంటే చాలా ఆలోచించాల్సిన విషయమే. మహేష్‌ బాబు ఇందుకు సిద్దపడే ఒప్పుకున్నారు కనుక అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించేదే.