అన్ స్టాపబుల్‌-4 ప్రమో వచ్చేసిందిగా!

ప్రముఖ నటుడు, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్ స్టాపబుల్‌ సీజన్‌-4 మొదటి ఎపిసోడ్‌ ప్రమో విడుదలైంది. ఈసారి కూడా మొదటి ఎపిసోడ్‌కి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అతిధిగా వచ్చారు. 

ఎప్పటిలాగే బాలయ్య పంచ్ డైలాగులు, వాటిలో విరుపులు, మెరుపులతో అందరినీ అలరించారు. చంద్రబాబు నాయుడు కూడా చాలా సరదాగా, సమయస్పూర్తితో జవాబులు చెపుతూ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రమోలో చంద్రబాబు నాయుడుని జగన్‌ అరెస్ట్ చేయించి జైల్లో పెట్టడం, అక్కడ అనుభవించిన కష్టాలు, పవన్‌ కళ్యాణ్‌ భేటీతో రాష్ట్ర రాజకీయాలలో వచ్చిన కొత్త మలుపు, ఐ‌టి కంపెనీలు వంటి అనేక గంభీరమైన ప్రశ్నలు సందించి చంద్రబాబు నాయుడుతో జవాబులు చెప్పించారు.         

మళ్ళీ అంతలోనే, “మీ ఇంట్లో మా చెల్లి భువనేశ్వరి, మా అమ్మాయి బ్రాహ్మణి ఇద్దరిలో ఎవరి పెత్తనం సాగుతుంది? అంటూ చిలిపిగా ప్రశ్నిస్తే “ఇప్పుడు మా ఇంట్లో ఇదే పెద్ద సమస్య అయిపోయింది,” అంటూ చంద్రబాబు నాయుడు జవాబు చెప్పేసరికి అందరూ హాయిగా నవ్వారు. 

వీరిద్దరూ పాల్గొన్న మొదటి ఎపిసోడ్‌ ఈ నెల 25 నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం అవుతుంది.