
సల్మాన్ దుల్కర్, మీనాక్షీ జంటగా ‘లక్కీ భాస్కర్’ ఈ నెల 31న విడుదల కాబోతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది.
ఓ సామాన్య మద్యతరగతి ఉద్యోగి తన కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను భరించలేక వాటి నుండి బయటపడేందుకు ఏం చేశాడు. చిరు ఉద్యోగిగా ఉన్న అతను హటాత్తుగా ఎలా ధనవంతుడు అయిపోయాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఈ సినిమా కధ అని ట్రైలర్‌లో చెప్పేశారు.
ట్రైలర్‌లో సల్మాన్ దుల్కర్ నటన, పంచ్ డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరోయిన్ మీనాక్షి నటన కూడా చాలా సహజంగా ఉంది. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసిందని చెప్పవచ్చు. మరి సినిమా ఎలా ఉంటుందో 31న తెలుస్తుంది.
ఈ సినిమాకి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: నిమిషి రవి, ఆర్ట్: బంగాళన్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
శ్రీకర్ స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు.