విజయ్ సేతుపతి, నయనతార జంటగా ‘నేను రౌడీనే’ సినిమా 9 ఏళ్ళ క్రితం విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె ఆ సినిమా గురించి తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టారు.
“నా జీవితాన్ని, నా సినీ కెరీర్ని కూడా మార్చేసిన సినిమా అది. విగ్నేష్ దర్శకత్వంలో చేసిన ఆ సినిమా హిట్ అవడంతో నా కెరీర్లో అదో మైలురాయిగా నిలిచిపోయింది. అంతేకాదు ఆ సినిమాయే నాకొ అద్భుతమైన జీవిత భాగస్వామి విగ్నేష్ని ఇచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో నేను విగ్నేష్ నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. కనుక ఆ సినిమా నాకు చాలా ప్రత్యేకం,” అని దానిలో పేర్కొన్నారు.
ఆమె భర్త విగ్నేష్ కూడా ఆ సినిమా, దాంతో తాము దగ్గరవడం గురించి వివరిస్తూ, “నేను ఈ సినిమా గురించి ధనుష్కి చెప్పినప్పుడు ఆయన ఈ సినిమాకి నయనతార హీరోయిన్గా ఉంటే బాగుంటుందని చెప్పారు. అప్పుడే తొలిసారిగా ఆమెను కలిసి ఈ కధ వినిపించగా వెంటనే ఒప్పుకున్నారు. ఆ తర్వాత సుమారు ఏడాదిపాటు ఈ సినిమా షూటింగ్ జరిగింది. అప్పుడు ఆమె ఇష్టాయిష్టాలు, ఆలోచనలు, అభిప్రాయాలు అన్నీ తెలుసుకోగలిగాను. ఆ సినిమా పూర్తయ్యేసరికి మేము దగ్గరయ్యాము. కనుక ఈ సినిమా నాకు కూడా చాలా ప్రత్యేకమే,” అని విగ్నేష్ పేర్కొన్నారు.