చాలాకాలంగా ప్రేమలో ఉన్న నాగ చైతన్య, శోభిత ధూళిపాళల వివాహ నిశ్చితార్దం ఆగస్ట్ 8వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అది పూర్తి కాగానే వారి పెళ్ళి జరుగుతుంది. వారిరువురూ తమ వ్యక్తిగత జీవితం గురించి నలుగురితో పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు.
కానీ శోభిత దూళిపాళతో కలిసి ఓ లిఫ్టులో దిగిన ఓ తాజా ఫోటోని నాగ చైతన్య, తన అభిమానులతో పంచుకున్నారు. నిశ్చితార్ద వేడుకలో సాంప్రదాయ దుస్తులలో అందరినీ ఆకట్టుకున్న వారిరువురూ తాజా ఫోటోలో మోడ్రన్ దుస్తులు, కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని చాలా స్టయిలిష్‌గా ఉన్నారు. తమ ఫోటోకి ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్” అనే క్యాప్షన్ జోడించారు.
చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ‘తండేల్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నాగ చైతన్య చేపలు పట్టే మత్స్యకారుడుగా నటిస్తున్నాడు.
తండేల్కు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శాందత్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. దీనిని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి నిర్మిస్తున్నారు. తండెల్ డిసెంబర్ 20వ తేదీన విడుదల కావలసి ఉండగా జనవరి లేదా ఫిబ్రవరికి వాయిదా పడబోతున్నట్లు తెలుస్తోంది.