నిర్మాత నాగవంశీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు సమాధానంగా, “పెద్ద హీరోలతో సినిమాలు ఎందుకు తీస్తాము? పెద్ద హీరోల సినిమాలు చూసేందుకు జనాలు ఎందుకు వస్తారు? అంటే హీరో హీరోయిజం చూపించాలి... అందుకు తగ్గట్లు మంచి ఫైట్స్ ఉండాలి. మంచి డాన్సులు ఉండాలి... అవుంటే చాలు కానీ కధ, దానికో బలం, స్క్రీన్‌ప్లే, తొక్కా తోటకూర ఎవరిక్కావాలి? ఎవరడిగారు?హీరో ప్రేక్షకులను మెప్పిస్తే చాలదా?” అని అన్నారు.
కోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తీసే ఓ నిర్మాత ఈవిదంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కధ, స్క్రీన్ ప్లే ఏదీ అవసరం లేకపోతే కొన్ని ఫైట్లు, కొన్ని డ్యాన్సులతో సినిమా తీసి విడుదల చేస్తే సరిపోతుంది కదా?అప్పుడు సినిమాల కోసం ఇంత సమయం, శ్రమ, ఖర్చు అన్నీ తగ్గుతాయి కదా?
ఇది వెటకారమైతే గనక, అదిరిపోయింది.
— Madhuri (తెలుగింటి అమ్మాయి) (@YaminiDiva) October 19, 2024
ఒకవేళ నిజంగానే అంటేగనక ఇంకా అదిరిపోయింది!
pic.twitter.com/lFQKLRHMhr