
ఇప్పుడు తెలుగు సినిమాలు పాన్ ఇండియా మూవీలుగా విడుదల చేస్తుండటం, వాటిలో బాలీవుడ్ నటులు నటిస్తుండటం చాలా మామూలు విషయం. అలాగే బాలీవుడ్ హీరోలు తెలుగు దర్శకులతో హిందీ సినిమాలు చేయడం కొత్త ట్రెండ్.
దాని ప్రకారం తెలుగు సినీ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ ఓ సినిమా చేస్తున్నారు.
ఈ రోజు ఆయన పుట్టినరోజు కావడంతో ఆ సినిమాలో ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేసి, సినిమా పేరు ‘జాట్’ అని ప్రకటించారు. ఓ భారీ సీలింగ్ ఫ్యాన్‌ని చేతిలో ఆయుధంలా పట్టుకుని సన్నీ డియోల్ చాలా రౌద్రంగా చూస్తున్నట్లు పోస్టర్లో చూపారు. బాలీవుడ్లో సన్నీ డియోల్ అంటే యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. కనుక ఇది ఆ జోనర్‌లోనే ఉండబోతోంది.
మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. రెండు తెలుగు సినీ నిర్మాణ సంస్థలు, తెలుగు దర్శకుడు, తెలుగు సంగీత దర్శకుడు కలిసి పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు కనుక ఇది తెలుగులో కూడా విడుదలవుతుంది. ఈ సినిమాలో రెజినా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.