మెకానిక్ రాఖీ ట్రెయిలర్… శ్రీరాములు థియేటర్లో!

విశ్వక్ సేన్‌ హీరోగా మెకానిక్ రాఖీ సినిమా నవంబర్‌ 22న విడుదల కాబోతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ట్రైలర్‌ విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ఆదివారం సాయంత్రం మూసాపేట్‌లోని శ్రీరాములు థియేటర్లో ట్రైలర్‌ విడుదల కాబోతోంది. థియేటర్లో కలుద్దామంటూ విశ్వక్ సేన్‌ ట్వీట్‌ చేశాడు. విశ్వక్ సేన్‌ థియేటర్‌కి వస్తే అతనితో కలిసి ట్రైలర్‌ చూడటం అభిమానులకు పండగే. అలాగే విశ్వక్ సేన్‌కి కూడా.       

నూతన దర్శకుడు ముళ్ళపూడి రవితేజ దర్శకత్వంలో సిద్దమవుతున్న ‘మెకానిక్ రాఖీ’లో విశ్వక్ సేన్‌కు జోడీగా మీనాక్షీ చౌదరి నటిస్తోంది. శ్రద్ధ శ్రీనాధ్, సునీల్, నరేశ్ వికె, హైపర్ ఆది, హర్ష వర్ధన్, వివ హర్ష, రఘురాం తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ చరణ్‌ తాళ్ళూరి నిర్మిస్తున్న మెకానిక్ రాఖీ సినిమాకి కధ, దర్శకత్వం: రవితేజ ముళ్ళపూడి, పాటలు: సుద్ధాల అశోక్ తేజ, కృష్ణ చైతన్య, సనరే, కెమెరా: మనోజ్ రెడ్డి కాటసాని, కొరియోగ్రఫీ: భాను, యష్, యాక్షన్: సుప్రీం సుందర్, ఎడిటింగ్: అన్వర్ అలీ చేస్తున్నారు.