
అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమైన సినిమా అఖిల్ ఆ సినిమాలో బాలీవుడ్ నుండి సయేషా సైగల్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక సెకండ్ సినిమాగా అజయ్ దేవగన్ శివాయ్ లో నటించిన ఈ చిన్నది బీ టౌన్ నీళ్లు బాగా పడినట్టు ఉన్నాయి. అందుకే సినిమాలో లిప్ లాక్, బికిని సీన్స్ ఉన్నా మొహమాట పడేది ఏం లేదని అంటుంది.
బాలీవుడ్ లో క్రేజ్ దక్కించుకోవాలంటే స్కిన్ షో చేయక తప్పదు ఆ విషయం ముందే కనిపెట్టేసిన సయేషా తాను కూడా వాటికి సిద్ధమే అంటుంది. సీన్ డిమాండ్ మేరకు లిప్ లాక్, బికిని సీన్స్ కూడా సై అంటుంది ఈ సుందరి. అయితే న్యూడ్ సీన్స్ మాత్రం చేయనని చెబుతుంది. అయితే ప్రస్తుతం భారతీయ సినిమా న్యూడ్ సీన్స్ సినిమాలో ఉంచేంత సీన్ రాలేదు. మరి అవి కాకుండా అన్నిటికి ఓకే అంటున్న సయేషా ఏమేరకు ఆఫర్లు అందుకుంటుందో చూడాలి.
తెలుగులో కూడా ఓ ఛాన్స్ కొట్టేసిన సయేషా ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు మూడు ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయట. మరి అమ్మడిని ఆ యాంగిల్ లో వాడుకునే దర్శకుడెవరో చూడాలి.