ఇక నుండి సింహా అవార్డులు..!

రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలుగు సిని పరిశ్రమకు సంబందించిన కళాకారులను నంది అవార్డులతో సత్కరించడం ఆనవాయితి. అయితే తెలుగు రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడే వీటిని ఇచ్చేందుకు టైం లేకుండా పోయింది. ఇక రాష్ట్రం రెండుగా చీలిన తర్వాత అదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం దీని మీద ప్రత్యేక చర్చలు జరుపుతున్నదట.

నంది అవార్డులకు బదులు సింహా అవార్డులుగా తెలంగాణ ప్రభుత్వ ఈ అవార్డులను ప్రభుత్వం తరపున ఇవ్వనున్నారట. ఇప్పటికే దీనికి సంబందించిన ఓ కమిటి ఈ కార్యక్రమాల్లో ఉందని సమాచారం. 2017 లో మొదటి సింహా అవార్డుల వేడుక జరుగనున్నదట. దాదాపు 5 సంవత్సరాలుగా నంది అవార్డులన్న మాటే ఎత్తలేదు. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కత్తి కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, పడి జయరాజ్, దాశరధి కృష్ణమాచార్య వంటి వారి పేరు మీద కొత్త అవార్డులను ఇవ్వబోతున్నారట.  

ఇక సంగీత దర్శకుడు చక్రి పేరు మీద కూడా ఓ అవార్డ్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. మరి కొత్త రాష్ట్రంలో ఏర్పరచుకున్న ఈ సింహా కళాతోరణం ప్రతి సంవత్సరం జరగాలని ఆశిద్దాం.