భరణి గారు కస్సు బుస్సు

రచయితగా ఎంట్రీ ఇచ్చి తర్వాత నటుడిగా దర్శకుడిగా తన ప్రతి చాటుకున్న తర్ణికెళ్ల భరణి సీనియర్ డైరక్టర్ వంశీ మీద కస్సు బుస్సులాడుతున్నాడట. ఇద్దరు కలిసి తీసిన లేడీస్ టైలర్ సీక్వల్ గా ఓ సినిమా రూపొందించబడుతుంది. అయితే ముందు ఆ సీక్వల్ కు తణీకెళ్ల భరణి గారే కథ అందించారట. మధ్యలో ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ నుండి భరణి గారి బయటకు వచ్చేశారట.

ఓ పక్క లేడీస్ టైలర్ సీక్వల్ గా ఫ్యాషన్ డిజైనర్ సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. అయితే అది నేను రాసిన కథ కాదని నా కథ పక్కన పెట్టేశారని వాపోతున్నాడు భరణి. వ్యవహారం ఎక్కడ చెడిందో ఏమో కాని వంశీ తీసుకున్న ఈ నిర్ణయం భరణికి మింగుడు పడట్లేదని తెలుస్తుంది. ఇప్పటికే చాలామంది హీరోలు ఆ సినిమాను చేద్దాం చేద్దాం అని హ్యాండ్ ఇచ్చారు. 

ఫైనల్ గా సుమంత్ అశ్విన్ ఈ సినిమాకు ఓకే చెప్పాడట. మరి ఈ ఫ్యాషన్ డిజైనర్ ఎలాంటి సందడి చేస్తాడో చూడాలి. ఈ మధ్య ఘోరమైన ఫెల్యుర్యూస్ ఫేస్ చేసిన వంశీ ఫ్యాషన్ డిజైనర్ తో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. ఆ క్రమంలోనే భరణి రాసిన కథ నచ్చక పక్కన పెట్టారని అంటున్నారు.