అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన చరణ్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న ధ్రువ సినిమా ఆడియో ఈ నెల 9న గ్రాండ్ గా రిలీజ్ చేస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. అంతేకాదు ఈ ఆడియోకి పవర్ స్టార్ గెస్ట్ గా తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేశారని తెలుస్తుంది. మరి ఇంతలో ఏమైందో ఏమో కాని ధ్రువ ఆడియో డైరెక్ట్ గా మార్కెట్ లోకే రిలీజ్ చేస్తానని అంటున్నాడు చరణ్.

కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తని ఒరువన్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇక సరైనోడు సినిమా లానే ఆడియో లేకుండా సినిమా రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సరైనోడు ఫంక్షన్ వైజాగ్ లో జరిగింది. కాని ఈసారి విజయవాడలో ఈ ఈవెంట్ ఏర్పాటు చేయబోతున్నారట. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్న ఈ ఈవెంట్ లో మెగా హీరోలంతా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారని తెలుస్తుంది. మరి ధ్రువ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో చూడాలి.