ప్రస్తుతం సినీ పరిశ్రమలో హిట్స్, ఫ్లాపులను పట్టించుకోకుండా అందరు హీరోల కంటే ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరో మాస్ మహరాజ్ రవితేజ. రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర ఫ్లాప్ అయిన తర్వాత ధమాకాతో హిట్ కొట్టాడు. దాని తర్వాత టైగర్ నాగేశ్వరరావు పూర్తి చేస్తున్నాడు. అది రిలీజ్ కాకముందే కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ సినిమా చేస్తున్నాడు.
ధమాకాతో హిట్ అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పైనే ఈ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారు. దీనిని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ విషయం తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్లో మంటల్లో తగలబడుతున్న ఓ అడవి దానిలో ఓ ఇల్లు, దాని ఎదురుగా తుపాకీటో నిలబడిన రవితేజలను చూపారు. పైన ఆ మంటలను ఆర్పేందుకు వస్తున్న హెలికాఫ్టర్లను చూపారు. పోస్టర్ చూస్తే ఇదేదో చాలా భారీ యాక్షన్ మూవీలాగే కనిపిస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్లుగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటిస్తున్నారు. ఇంకా అనవదీప్, మధుబాల తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం, కెమెరా, స్క్రీన్ ప్లే: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: కరణం మణిబాబు, సంగీతం: దవ్ జాంద్ చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.