మారుతి-ప్రభాస్ సినిమా నుంచి చిన్న లీక్

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ మారుతి వంటి చిన్న దర్శకుడుతో సినిమా చేస్తుండటం చాలా ఆశ్చర్యకరమే. ఈ సినిమాకు సంబందించి ఎటువంటి సమాచారం వెల్లడించకుండానే ఇద్దరూ కలిసి సైలంట్‌గా సినిమా షూటింగ్‌ పూర్తి చేసేస్తున్నారు.

ఈ సినిమాలో ముగ్గృ హీరోయిన్లలో ఒకరైన మాళవికా మోహన్ మీద ఓ ఫైటింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా, ఆ వీడియో ఎలాగో బయటకు లీక్ అయ్యింది. ఓ కూరగాయల మార్కెట్లో  ఆమె రౌడీలతో ఫైట్ చేస్తున్న సన్నివేశం అది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇంతవరకు ఈ సినిమా టైటిల్ ప్రకటించనప్పటికీ ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. కనుక త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెడితే పూర్తి వివరాలు తెలుస్తాయి.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కల్కి ఏడి 2898, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ (పార్ట్-1) చేస్తున్నారు. వీటిలో కల్కి ఏడి 2898 వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి పండుగకు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. సలార్ మాత్రం మార్చి, ఏప్రిల్ నెలల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కల్కి ఏడి 2898లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే హీరోయిన్‌గా చేస్తుండగా, సలార్‌లో శ్రుతీ హాసన్ చేస్తోంది. సైన్స్ ఫిక్షన్ మూవీగా చాలా బారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తున్న కల్కి ఏడి 2898లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

From the Sets of #prabhas #Maruthi Film. Heroine ke ee level fights unnayi ante, Hero ki oohinchukuntene 🥵💥#MalavikaMohanan pic.twitter.com/ouBe6sqTQj
— 🅺🅰🅸🅻🅰🆂🅷 (@KailashPrabhas_) September 15, 2023