సలార్ అభిమానులు కాస్త అర్ధం చేసుకోండి ప్లీజ్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతి హాసన్ జంటగా చేస్తున్న సలార్ ఈనెల 28న విడుదల కావలసి ఉండగా రెండు మూడు వారాల ముందు సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు హాయంబలే సంస్థ డిస్ట్రిబ్యూటర్లకు సందేశాలు పంపినప్పుడు ఆ విషయం బయటకు పొక్కడంతో అభిమానులు షాక్ అయ్యారు. అయితే సినిమా వాయిదా వేస్తున్నట్లు కానీ మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తామని గానీ ప్రకటించకపోవడంతో అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ అందరూ కాస్త ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేసింది. 

“సలార్‌కు మద్దతు ఇస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అనివార్య కారాణాల వలన ఈనెల 28న విడుదల కావలసిన సలార్‌ను వాయిదా వేయవలసివచ్చింది. మీ అందరికీ అత్యద్భుతమైన సినిమాను చూసిన అనుభవం కలిగించేందుకు మేము చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొన్నాము. అత్యున్నత ప్రమాణాలతో సినిమాని రూపొందించేందుకు మా టీం ఆవిశ్రాంతంగా పనిచేస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తామో ప్రకటిస్తాము. ప్రస్తుతం సలార్‌కు ఫైనల్ టచస్ ఇస్తున్నాము. సలార్‌తో కలిసి పయనిస్తున్న అందరికీ కృతజ్ఞతలు,” అని ట్వీట్ చేశారు.