‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఒక్కటి చాలు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రతిభని గుర్తించడానికి. ఇప్పుడు ఆయన తనలో నటుడిని కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు తన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘పెదకాపు’ సినిమాతో.
రెండు భాగాలుగా తీస్తున్న ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, నాగబాబు, రాజీవ్ కనకాల, రావు రమేష్, ఈశ్వరి, అనసూయ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విలన్‌గా నటిస్తున్నారు.
నిజానికి ఈ పాత్ర కోసం మలయాళ నటుడు శౌబిన్ షహీర్‌ను అనుకొన్నామని కానీ షూటింగ్ మొదలయ్యే సమయానికి ఆయన రాకపోవడంతో నా అసోసియేట్ కిషోర్ అన్నా నువ్వే ఈ పాత్ర ఎందుకు చేయకూడదు?అంటూ ప్రోత్సహించడంతో ధైర్యం చేసి మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చానని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది కనుక దానిలో ఆయన నటన ఏవిదంగా ఉందో చూడవచ్చు.