యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కమ్ముకొని మనుషుల ప్రాణాలను కబళించివేస్తున్నప్పుడు, అగ్రదేశాలన్నీ భారత్ పరిస్థితి ఏమిటి? కరోనాతో భారత్లో ఎన్ని కోట్లమంది చనిపోతారు? శవాలు గుట్టలు.. అంటూ ఆలోచించారే తప్ప ఎవరూ భారతదేశమే కరోనాను ముందుగా అధిగమించి, ప్రపంచదేశాలను కాపాడేందుకు వాక్సిన్ కూడా తయారుచేసి అందిస్తుందని కలలో కూడా ఊహించలేదు. కానీ భారత్ కరోనా వాక్సిన్ తయారుచేసి అందించి కొట్లాదిమంది ప్రాణాలను కాపాడింది.
అయితే ఆ సమయంలో అగ్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా తమ వాక్సిన్లు అమ్ముకొని లాభాలు ఆర్జించాయి. ఆదేవిదంగా భారత్లో కూడా వాక్సిన్ తయారు చేసే కంపెనీల మద్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. దీంతో అతి తక్కువ సమయంలో తీవ్రమైన ఒత్తిళ్ళ మద్య భారత్ శాస్త్రవేత్తలు కరోనాను కట్టడి చేసేందుకు వాక్సిన్ ఏవిదంగా తయారుచేశారు?అనే కధాంశంతో ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా దర్శకుడు ‘ది వాక్సిన్ వార్’ అనే సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది.
ప్రముఖ మరాఠీ హిందీ సినీ నటుడు నానాపటేకర్, అనుపమ్ ఖేర్, పల్లవి జోషీ, గిరిజ ఓక్, నివేదిత భట్టాచార్య, సప్తమి గౌడ, మోహన్ కపూర్ తదితరులు ఈ సినిమాలో నటించారు. పాన్ ఇండియా మూవీగా 5 భాషలలో వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 28న విడుదల కాబోతోంది.