రజినీకాంత్‌ కొత్త సినిమా... లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం జైలర్‌తో హిట్ కొట్టారు. ఈ వయసులో కూడా సూపర్‌ హిట్స్ కొట్టడం మామూలు విషయం కాదు. తన సినిమా సూపర్ హిట్ అయ్యిందని రజినీకాంత్ విశ్రాంతి తీసుకోవాలనుకోలేదు వెంటనే మరో సినిమా మొదలుపెట్టేస్తున్నారు. తన 171 వ చిత్రాన్ని ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ విషయాన్ని లోకేష్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఈ సినిమాకు సంగీతం అనిరుద్, స్టంట్స్: ఏఎన్ భైరవ్ చేయబోతున్నారని తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.