మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్, గోపీచంద్ నటించిన రామబాణం సినిమాలు ఈ వారంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీలో రాబోతున్నాయి. రామబాణం సినిమా 14న, భోళా శంకర్ 15వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతున్నాయి.
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ ప్రధానపాత్రలలో కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చిన భోళాశంకర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్, డింపుల్ హయాతి, జగపతిబాబు, ఖుష్బూ ప్రధానపాత్రలలో రామబాణం సినిమా ఈ ఏడాది మే 5న థియేటర్లలో విడుదలైంది. కానీ అది కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాయి.
ఇవికాక ఈ నెల 15న ఆహా ఓటీటీలో మాయపేటిక, అమెజాన్ ప్రైమ్‌లో అనీతి తెలుగు డబ్బింగ్ సినిమాలు ప్రసారం కాబోతున్నాయి.