చిరంజీవి 157వ సినిమా పనులు షురూ

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా చేసిన భోళా శంకర్ అందరినీ నిరాశపరిచడంతో తర్వాత సినిమా కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ‘మెగా 157’ వర్కింగ్ టైటిల్‌తో కొత్త సినిమా మొదలుపెట్టారు. కళ్యాణ్ రామ్‌కు బింబిసార వంటి సూపర్ హిట్ అందించిన వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ఆదివారం మొదలయ్యాయి. దర్శకుడు వశిష్ట ఈ విషయం తెలియజేస్తూ తన బృందంతో కలిసి చిరంజీవితో దిగిన ఫోటో ను సోషల్ మీడియాలోఅభిమానులకు షేర్ చేశారు. 

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బేనర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మించబోతున్నారు. మెగా 157 సినిమాకి కెమెరా: ఛోటా కె. నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి అందిస్తారు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు ప్రకటిస్తామని దర్శకుడు వశిష్ట చెప్పారు.